చేసింది చాలు.. ఇక కప్ ఇచ్చేయండి

ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన టీమిండియా ఏసీసీ ఛైర్మన్‌ నఖ్వి నుంచి ట్రోఫీని అందుకోవడానికి తిరస్కరించింది. నఖ్వి ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా తనతో తీసుకెళ్లాడు. నఖ్వి తీరుపై ఆగ్రహంగా ఉన్న BCCI.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రోఫీ ఏసీసీ సొత్తు అని, నఖ్విది కాదని గుర్తు చేశారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్‌కు అందజేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలన్నారు.
ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాలని, అక్కడి నుంచి దాన్ని తీసుకుంటామని బీసీసీఐ ప్రతినిధి తెలపగా.. అందుకు నఖ్వి అంగీకరించలేదు. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరముందన్నాడు. ట్రోఫీ తమదేనని, చర్చించడానికి ఏమీ లేదని రాజీవ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయంపై నవంబర్‌లో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
Previous articleOG నాలుగు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
Next articleఆ ముగ్గురు లేకుండా బరిలోకి టీమిండియా