AP ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ కంపెనీ రూ.88,628 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్స్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్‌ను వినియోగించనున్నారు.