మరో మూడు నెలల మారటోరియం.. EMI కట్టాలా.. వద్దా..?

2
కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఒకవైపు వేలాది మంది వైరస్ బారినపడి చనిపోతుంటే.. మరోవైపు పని లేక వేలాది మంది పస్తులుంటున్నారు. ఏదో ఒక పని చేసుకుంటూ కాలం వెళ్లదీసిన సామాన్యులకు ఇప్పుడు ఆకలితో అలమటించే దుస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌తో నెల గడవడం కూడా ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. అయితే RBI ఇచ్చిన EMI మారటోరియం ఆప్షన్‌ను వాడుకోవాలా.. వద్దా అనేది ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీసింది.
మారటోరియం అంటే ఏంటి? EMI మాఫీ చేస్తున్నట్టా.. వాయిదా వేస్తున్నట్టా అనేది చాల మంది ప్రశ్న. ఇది మాఫీ కాదు.. కొంతకాలం పాటు ఇప్పుడు కడుతున్న EMIని ముందుకు జరపడం.. అంతే కానీ రద్దు కాదు. అయితే EMI మారటోరియం అన్నది మన EMIని మూడు నెలలు ముందుకు తీసుకెళ్తుందని సంతోషం మాత్రం వద్దు. మూడు నెలల EMI కట్టనందుకు మన లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద ఈ మూడు నెలలకు ఇంట్రెస్ట్ పడుతుంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకరోనా వైరస్ ఎఫెక్ట్.. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు మరోసారి నిరాశ..
Next articleమీ మొబైల్‌లో వైరస్ ఉందా.. గుర్తించడం ఎలా.. మరి పరిష్కారం ఏంటి..?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here