తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదంటూ ఓ అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
మాస్కులు తొలగించాక చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. తొలగించిన మాస్కులను మూత ఉన్న చెత్తడబ్బాలోనే వేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ సహా పలు చోట్ల మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com