చైనాకు మరో షాక్.. ప్రధాని మోదీ బాటలో ట్రంప్ సర్కార్ అడుగులు..

2
భార‌త్ దారిలోనే అమెరికా అడుగులు వేస్తోంది. టిక్‌టాక్‌తో పాటు చైనా సోషల్ మీడియా యాప్‌ల‌ను నిషేధం దిశగా ఆలోచిస్తున్నామని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఇప్పటికే టిక్‌ టాక్‌ స‌హా 59 చైనా యాప్‌ల‌ను కేంద్రప్రభుత్వం నిషేధించింది.
చైనా క‌మ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి కంపెనీలు, చైనా ప్రభుత్వానికి స‌హ‌క‌రిస్తున్నాయ‌ని ఇప్పటికే అమెరికా చ‌ట్టస‌భ్యులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిక్‌టాక్ వంటి యాప్‌లు సేక‌రించే స‌మాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చైనా యాప్‌ల‌ను నిషేధిస్తూ భార‌త్ తీసుకున్న నిర్ణయాన్ని మైక్ పాంపియో స‌మ‌ర్థించారు. ఆ యాప్‌ల‌ను నిషేధించ‌డం స‌రైన నిర్ణయమేనని పాంపియో స్పష్టం చేశారు.
కరోనా వైరస్ విషయంలో చైనా గోప్యత పాటించడం వల్లే ఇదంతా జరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా చైనా తీరుపై విరుచుకుప‌డుతున్న అమెరికా, హాంకాంగ్ వ్యవహారంలోనూ డ్రాగ‌న్ దేశంపై గుర్రుగా ఉంది. తాజాగా యాప్‌ల నిషేధం దిశ‌గా అడుగులు వేయ‌డం ఆసక్తి రేపుతోంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleశరభ, నరసింహ అవతారాల్లో గెలిచిందెవరు.. విష్ణుమాయగా ఎందుకు వర్ణించారు?
Next articleనిజ‌మైన నాయ‌కులు ఓట్ల నుంచి కాదు.. జ‌నం గుండెల్లో నుంచి పుడ‌తారు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here