కిక్ శ్యామ్ అరెస్ట్ అందుకేనా.. ఫిర్యాదు చేసింది వారేనా..

2
ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే జూదానికి వినియోగించిన టోకెన్లను అతని అపార్ట్‌మెంట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు, తమళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కత్తి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా జూదంలో పెద్ద మొత్తంలో డ‌బ్బు పోగొట్టుకున్న‌ మరో ప్రముఖ నటుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ సోదా చేపట్టినట్టు తెలుస్తోంది. న‌టుడి క్ల‌బ్‌పై నిర్వ‌హించిన దాడిలో ఎవ‌రైనా సినీ ప్ర‌ముఖులు దొరికారా..లేదా..అనేది ఇంకా వెల్ల‌డికాలేదు. ప్ర‌స్తుతం ఘటనకు సంబంధించి పోలీసులు స‌మ‌గ్ర విచారణ చేస్తున్నారు.
కాగా శ్యామ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా ఎదిగారు. 2001 నుంచి అతడు పలు సినిమాల్లో నటించాడు. అయితే 2009లో వచ్చిన కిక్ సినిమా అతడి కెరిర్‌ను మలుపు తిప్పింది. అతడి పేరు కూడా అప్పట్నుంచి కిక్ శ్యామ్‌గా మారింది. శామ్ పూర్తి పూరు మొహమ్మద్ షమ్‌షుద్దీన్ ఇబ్రహీం. ఆయనకి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Previous articleముందే బెడ్స్ బుక్..వారైతే తెగ టెన్షన్ పడిపోతున్నారుగా..
Next articleరాఫెల్ వచ్చేసింది.. మరి మోడీ వ్యూహం ఏంటి..?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here