Ravindra Jadeja: రికార్డ్ సృష్టించిన జడేజా.. ఐదో భారత బౌలర్‌గా ఘనత

ఈ రెండు వికెట్లతో టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన ఐదో భారత బౌలర్‌గా జడేజా ఘనత వహించాడు. ఈ రికార్డుతో అతడు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ బౌలర్ల సరసన నిలిచాడు.

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మంగళవారం మార్నింగ్ సెషన్‌లో జడేజా దక్షిణాఫ్రికా ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్‌క్రమ్‌ (29)లను పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు వికెట్లతో టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన ఐదో భారత బౌలర్‌గా జడేజా ఘనత వహించాడు. ఈ రికార్డుతో అతడు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ బౌలర్ల సరసన నిలిచాడు.

రికార్డుల వివరాలు

జడేజా ఆడిన 11వ టెస్ట్ మ్యాచ్‌లోని 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు ఇప్పటికీ అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 21 టెస్టుల్లో 84 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా 50 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 10 మ్యాచుల్లో 46 వికెట్లు సాధించాడు.
Previous articleBig Breaking: ఇవాళే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్..
Next articleకష్టానికి ప్రతిరూపం.. ప్రజాసేవే కర్తవ్యం..జనం కోసం సర్పంచ్ బరిలో పెంజర్ల నర్సింలు