CSK: మోర్‌ పవర్‌ టూ యూ..సంజూ

IPL-2026 ఆక్షన్‌ డిసెంబర్‌ 15న నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) ప్లాన్ చేస్తోంది. గత రెండు సీజన్ల IPL ఆక్షన్ విదేశాల్లో నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం ఆక్షన్‌ను ఇండియాలోనే నిర్వహించాలని BCCI నిర్ణయించింది. నవంబర్‌ 15లోపు అన్ని ఫ్రాంఛైజీలు తాము రిటైన్‌ చేసుకునే ప్లేయర్ల లిస్ట్‌ను BCCI సమర్పించాల్సి ఉంటుంది.
అయితే రాజస్థాన్‌ రాయల్స్‌(RR) కెప్టెన్‌ సంజు శాంసన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులోకి తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK) ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో సంజూకు బర్త్‌డే విషెస్‌ చెప్పింది. ‘మోర్‌ పవర్‌ టూ యూ, సంజూ.. విషింగ్‌ యూ ఏ సూపర్‌ బర్త్‌డే’ అంటూ పోస్ట్‌ చేసింది. దీంతో అతడు CSKలోకి వెళ్తాడన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.
Previous articleDELHI: పేలుడు కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Next articleSachin: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్