బిహార్‌లో రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 సీట్లకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించారు. ఇక మిగిలిన 20 జిల్లాల్లోని 122 సీట్లకు రెండో విడతలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి దశలో బిహార్ చరిత్రలోనే అత్యధికంగా 65 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో రెండో విడత పోలింగ్‌పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. రెండో విడతలో కూడా రికార్డు బ్రేక్ అవుతుందో.. లేదో చూడాలి
నెల రోజులుగా NDA, మహాఘట్బంధన్ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. NDA తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నడ్డా, BJP పాలిత రాష్ట్రాల సీఎంలు క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. మహాఘట్బంధన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకా గాంధీ, ఆర్జేడీ అగ్రనేత, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ ప్రచారం చేశారు.