సమస్యేదైనా, ఏ వివరాలు కావాలన్నా ప్రస్తుతం అందరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అందులోనూ అమ్మాయిలైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే వారు కొందరైతే.. నచ్చిన అంశాలపై ఫోకస్ పెట్టేవారు మరికొందరు.
బ్యూటీ, ఫ్యాషన్, హెల్త్, కెరీర్.. వంటి అంశాలపైనే అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకు చిన్న వయసులోనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా విషయాల్లో మరొకరి సలహా అవసరం లేకుండా అవగాహన పెంచుకుంటున్నారు.
అయితే గూగుల్‌లో అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేసే వాటిలో.. బ్యూటీ అండ్ మేకప్.. ఫ్యాషన్.. కొరియన్ డ్రామాలు.. హెల్త్ అండ్ ఫిట్నెస్.. స్టడీస్ అండ్ కెరీర్.. ఈ ఐదు టాపిక్స్‌ను అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.