టీమిండియాకు మళ్లీ షాక్.. సెమీస్ చేరాలంటే..

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భారత్‌కు మరో షాక్ తగిలింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ సేన ఓడిపోయింది  ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. హర్మన్‌ప్రీత్ సేనపై ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హీథర్ నైట్ సెంచరీతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. అయితే చేజింగ్‌లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 284 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ (50) రాణించినా భారత్‌ విజయం సాధించలేకపోయింది.
టీమిండియాపై విజయంతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా కూడా ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు చేరాయి. మిగిలిన ఒక్క బెర్త్ కోసం టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య పోటీ ఉంది. ఈ రెండు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ఇంకా టీమిండియా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో  ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో టీమిండియా గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది.

Previous article𝗠𝗲𝗴𝗮 𝗝𝗼𝗯 𝗠𝗲𝗹𝗮 𝗶𝗻 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮!
Next articleజూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్.. BRS కొత్త వ్యూహం