సీఎం మినహా మంత్రులు రాజీనామా

గుజరాత్(Gujarat )లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం భూపేంద్ర పటేల్ మినహా మంత్రులంతా రాజీనామా చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరించాలని సీఎం డిసైడ్ కావడంతో మంత్రులు రాజీనామా చేశారు. BJP జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, సీఎం భూపేంద్ర పటేల్.. మంత్రులతో విడివిడిగా సమావేశం అయ్యారు. అధిష్ఠానం ఆలోచనను వారికి వివరించారు.
పాత నేతల స్థానంలో కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. సీఎం భూపేంద్ర పటేల్.. గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరవుతారు.
భూపేంద్ర పటేల్ 2021లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022, డిసెంబర్ 12న రెండోసారి CM పదవిని చేపట్టారు. గుజరాత్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 182. నిబంధన ప్రకారం.. గుజరాత్‌లో మంత్రుల సంఖ్య 27 వరకు ఉండొచ్చు.
Previous articleవాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రెడీ..
Next articleTG: గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ కేబినెట్