బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి పార్టీలు పోటీ చేయబోయే సీట్ల లెక్క తేలింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ Xలో వివరాలను ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ సీట్ల మెుత్తం సంఖ్య 243. భారతీయ జనతా పార్టీ (BJP), జనతా దళ్ యునైటెడ్ (JDU) చెరో 101 సీట్లలో పోటీ చేస్తాయి. BJP కంటే జేడీయూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. అలాగే లోక్‌జన్ శక్తి (Ram Vilas)కు 29 సీట్లు కేటాయించారు. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు 6 సీట్లు, హిందుస్థాన్ అవామీ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించారు.

తమ కూటమి బిహార్‌లో తిరిగి అధికారం చేపడుతుందని NDA నేతలు ధీమా వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా జరగనుంది. నవంబర్ 6న తొలి విడత, 11న రెండో విడత పోలింగ్‌కు CEC ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహిస్తారు.
NDA కూటమి పార్టీలు పోటీ చేయబోయే సీట్లపై క్లారిటీ రావడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. నిన్న సాయంత్రం సమావేశమైన BJP సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బిహార్ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించింది. ఇవాళ తొలి జాబితాను బిజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రిలీజ్ చేస్తారు.