జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (BRS), BJPలు దూకుడు పెంచాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మాగంటి సునీతను భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక బీజేపీ.. అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు స్థానిక నాయకుల నుంచి కమిటీ అభిప్రాయ సేకరణ చేసింది. ముగ్గురి పేర్లతో కూడిన లిస్ట్‌ను రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు కమిటీ అందజేసింది.
అయితే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్‌ను కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు ఇస్తే బాగుంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. బొంతు రామ్మోహన్‌కు ఏబీవీపీ నేపథ్యం ఉందని చెప్పినట్లు తెలిసింది. జాతీయ నాయకత్వానికి పంపే జాబితాలో బొంతు రామ్మోహన్ పేరు కూడా ఉంటుందా.. లేక త్రిసభ్య కమిటీ సూచించిన పేర్లలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్న ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న బొంతు రామ్మోహన్.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారా.. జూబ్లీహిల్స్ టికెట్ కోసం బీజేపీలో చేరుతారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
Previous articleట్రంప్ కల నెరవేరుతుందా..?
Next articleట్రంప్‌కి నోబెల్ అందుకే రాలే