తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్‌ను విక్రయించొద్దంటూ సూచించింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వీటిని గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు చనిపోయారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ‘కోల్డ్ రిఫ్’ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రకటించింది.