పెద్దపల్లి జిల్లా మల్యాల పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో చోరీకి గురైన బంగారం కేసును పోలీసులు చేధించారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే క్రమంలో 108 సిబ్బందే అతని వద్ద ఉన్న సొమ్మును కాజేశారని పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 2 కిలోల 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు ,కొత్త రాంబాబు, గుండ సంతోష్ లు బంగారం వ్యాపారులు. అర్డర్లపై బంగారం సప్లై చేసే ఆ ముగ్గురూ వ్యాపార నిమిత్తం సుమారు 5 కేజీల 600 గ్రాముల బంగారంతో కారులో ప్రయాణిస్తుండగా.. మల్యాల పల్లి రామగుండం మూలమలుపు వద్ద యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శ్రీనివాస్ దగ్గరున్న 2 కేజీల 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగతా వారికోసం 108 సిబ్బందికి సమాచారమందించగా 108 అంబులెన్స్ సిబ్బంది EMT తాజుద్దీన్, డ్రైవర్ లక్ష్మారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో రాంబాబుకు ప్రథమ చికిత్స అందిస్తుండగా అతని చొక్కా జేబులో ఉన్న సుమారు 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని EMT తాజోద్దీన్, డ్రైవర్ లక్ష్మారెడ్డి కాజేసి పంచుకున్నారు. ఇక పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే రాంబాబు చనిపోవడంతో అతని మృతదేహన్ని ఆస్పత్రిలో చేర్చి.. తమకేమీ ఎరుగనట్టు ఎవరి డ్యూటీకి వారు వెళ్లిపోయారు.
కానీ మృతులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబుల కుటుంబ సభ్యులు మొత్తం 5కిలోల 600 గ్రాముల బంగారు అభరణాలకు బదులు 3 కిలోల 300 గ్రాములు మాత్రమే దొరికాయని, మిగిలిన 2 కిలోలు 300 గ్రాములు బంగారం దొరకలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్ సిబ్బందిని విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తాజుద్దీన్, లక్ష్మారెడ్డిలు కలిసి ఈ చోరీ చేశారని తెలియడంతో.. వారిద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కిలోలు 300 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.